ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ సెజ్‌పై సీఎం జగన్ ఎప్పుడో కన్నేశారని, అది జగన్ 14ఏళ్ల కల అని అన్నారు. తన తండ్రి హయాంలో టీడీపీ దీన్ని అడ్డుకుందని జగన్ కక్ష్య కట్టారని, సీఎం కాగానే మళ్ళీ తన బినామీలంతో కోనప్రాంతం కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ బినామీ విజయసాయి రెడ్డి అని, విజయసాయిరెడ్డి బినామీ ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి అని అన్నారు. ఆనాడు తండ్రి వైఎస్ హయాంలో జరిగిన భూమాయ మరువకముందే, ఇప్పుడు మళ్ళీ కొడుకు పాలనలో కోన రైతాంగాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టి 5 వేల కోట్ల భూముల్ని బినామీల పేరుతో కొట్టేస్తున్నారని, కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం 4,700 కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని ఈ సందర్భంగా యనమల డిమాండ్ చేశారు.