జైలుకెళ్ళాల్సి వస్తుందనే జగన్ భయం.. యనమల హాట్ కామెంట్స్..!

Wednesday, October 7th, 2020, 07:34:02 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటలకు వెళ్ళింది తనపై ఉన్న కేసులకు భయపడే అని అన్నారు. తన కేసులపై కోర్టులు రోజువారీ విచారణ ప్రారంభిస్తే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయం జగన్‌లో పట్టుకుందని అందుకే వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తూ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే నిన్న ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు భేటీ అయిన సీఎం జగన్ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి అంశాల గురించే మాట్లాడినట్టు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం, జీఎస్టీ చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, దిశ సహా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఏపీ బిల్లులు వంటి 17 అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లినట్లు తెలిసింది.