బిగ్ న్యూస్: జగన్ పాలన పై యనమల సంచలన వ్యాఖ్యలు

Wednesday, September 30th, 2020, 05:36:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రి గా సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం తెచ్చినటువంటి అప్పులను రాష్ట్ర అభివృద్ది కోసం కాకుండా, జగన్ తన అనుచరులకు పంచి పెడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ పాలన లో ఏడాదికి 26 వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే, వైసీపీ పాలన లో ఏడాది కి 1.13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల ఆర్థికాభివృద్ధి కి గండి కొట్టి, పెద్దలకు దోచి పెడుతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.