ఆ ప్రయత్నాలను తక్షణమే జగన్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి

Thursday, December 10th, 2020, 11:51:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే గతం లో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించినట్లు నటించిన వైసీపీ, ఇప్పుడు అనుమతి ఇవ్వడం లో ఆ పార్టీ అసలు రంగు బయట పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రసాయన పరిశ్రమల వలన సముద్ర జలాలు కలుషితం అయి, మత్స్య కారులు జీవనోపాధి కోల్పోతారు అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే భూములన్నీ ఉప్పు తేలడం తో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది అని అన్నారు.

అయితే అలాంటి వాటికి అనుమతి ఇవ్వడం ద్వారా చిరు వ్యాపారులు నష్టపోవడం మాత్రమే కాకుండా, ప్రభుత్వ రాబడి కూడా పడిపోతుంది అని తెలిపారు. అయితే సముద్ర జలాలుకలుషితం అయి, చేపల వేట లేకపోతే ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదన దారుణ మోసం అని అన్నారు. జగన్ బినామీలు బల్గ్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కోనసీమ ప్రాంతం లోని గ్రామాలను కబ్జా చేసి, తీర ప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపన కి యత్నిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.