రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోంది…జగన్ సర్కార్ పై యనమల ఆగ్రహం

Monday, December 21st, 2020, 12:00:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ప్రజల పరిష్కారానికి దివీస్ సంస్థ అంగీకారం తెలిపింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోంది అని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల పై పెట్టినటువంటి క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి అంటూ యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అయితే కేసులను తొలగిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదు అని, సంస్థను వేరొక ప్రాంతానికి తరలించడానికి కూడా అంగీకరించలేదు అని యనమల స్పష్టం చేశారు.

అయితే పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి కాలుష్యాల కారణంగా రొయ్యల వ్యాపారం దెబ్బతిని యువత ఉపాధి కోల్పోతారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యల పై ప్రభుత్వం స్పందించాలి తప్ప డివీస్ సంస్థ కాదు అని తేల్చి చెప్పారు. అయితే దివీస్ సంస్థ కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి పై కేసులు ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.