ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వై కేటగిరి భద్రత.. ఇక చుట్టూ 10 మంది..!

Thursday, August 6th, 2020, 12:50:45 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. కొద్ది రోజుల నుంచి రఘురామ కృష్ణంరాజు వైసీపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలంటూ ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరిక మేరకు కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పించినట్లు నిన్న రాత్రి తెలిసిందని, నేడు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారని ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ అమలులో ఉందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కర్ఫ్యూ సడలింపు తర్వాత నియోజకవర్గానికి వెళతానని అన్నారు.