రెజ్లర్ రితికా ఫోగట్ ఆత్మహత్య

Thursday, March 18th, 2021, 12:02:27 PM IST

ప్రముఖ రెజ్లర్ ఫోగట్ సోదరీమణుల బంధువు అయిన రితికా ఫొగట్ ఆత్మహత్య కి పాల్పడింది. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన రితిక ఆత్మహత్య గా చెప్పుకు వస్తున్నారు. అయితే ఈ మృతి పట్ల హర్యానా పోలీసులు దర్యాప చేస్తున్నారు. అయితే ప్రముఖ రెజ్లర్స్ అయిన గీతా, బబిత ఫోగాట్ ల కజిన్ అయిన రితికా, మహావీర్ స్పోర్ట్స్ అకాడెమీ లో శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల మార్చి 12 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు భరత్ పూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ టోర్నీ లో ఫైనల్ వరకూ చేరుకున్న రీతికా ఒకే ఒక్క పాయింట్ తో ఓడిపోయింది. అయితే ఇదే కారణం తో తన ఇంట్లో నే ఆత్మహత్య కి పాల్పడి ఉండొచ్చు అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రితీకా మరణం తో ఫోగట్ కుటుంబ సభ్యులు మాత్రమే కాక, క్రీడా రంగం కూడా విచారం వ్యక్తం చేస్తోంది.