ఆ రోజు కోసం విశ్వమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది…!!

Sunday, November 6th, 2016, 01:06:33 PM IST

us
ప్రపంచ మంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఆ రోజుకు ఇంకా సరిగ్గా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 8 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుతాయి. ఫలితాల సమయం దగ్గర పేడే కొద్దీ హిల్లరీ, ట్రంప్ అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. నేటి వరకు చూసుకుంటే వీరిద్దరి ఫలితాల్లో వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది. చివరి క్షణంలో ఫలితారు తారుమారు అయ్యే పరిస్థితి కూడా ఉండడంతో ప్రపంచం మొత్తం ఈ ఎన్నికల ఫలితాల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం అమెరికానే కాకుండా ప్రపంచ దేశాలను మొత్తం రాజకీయకంగా, ఆర్థికంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దేశాధినేతల చూపులు అన్నీ వైట్ హౌస్ వైపే ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నప్పుడు ఓటింగ్‌ శాతం గెలుపోటములను నిర్ణయిస్తుంది. దాదాపు నెల రోజుల క్రితం ప్యూ రీసెర్చ్‌ సంస్థ సర్వేలో మహిళల్లో అత్యధికులు హిల్లరీని సమర్థిస్తుంటే, అత్యధిక పురుషులు ట్రంప్‌ను సమర్థిస్తున్నట్లు వెల్లడైంది.