ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులో వరల్డ్ రికార్డ్ కేసులు అట.!

Tuesday, June 9th, 2020, 09:56:26 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ ప్రజలను కంట్రోల్ లో పెట్టే సూచనలు కనిపించకపోయే సరికి కొన్ని నిబంధనలతో వారిని వదిలేసారు. అందరు ఇళ్లలో ఉన్నప్పుడే కరొనను ఎవరూ కట్టడి చేయలేకపోయారు.

ఇక బయటకు వస్తే అసలే ఆగదని పలువురు అంటుంటే లోపునే ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. మొన్న జూన్ 7వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా 1 లక్ష 36 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయట.

ఇదే ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు అని తెలుస్తుంది. అయితే ఈ అన్ని కేసుల్లోనూ మన దక్షిణ ఆసియా, దక్షిణ మరియు ఉత్తర అమెరికాలలోనే భారీగా వచ్చినవి అని తెలుస్తుంది. మరి ఈ వరల్డ్ రికార్డులు ఇక రాబోయే రోజుల్లో మరిన్ని నమోదు కావడం ఖాయం అని చెప్పాలి.