టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై మహిళ దాడి.. తిరుగుబాటు మొదలయ్యిందా?

Sunday, October 18th, 2020, 06:09:34 PM IST

హైదరాబాద్‌లోని వరదలపై ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, నేతలపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాయకులపై జనం తిరగబడుతున్నారు. అయితే నిన్న మరోసారి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్‌లోని చాలా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పోరేటర్ సామ తిరుమల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

రంగనాయకులగుట్టలో నాలా కబ్జాకు గురవుతుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు నీటిలో మునిగాకా ఎలా ఉన్నారో చూద్దామని వస్తారా అంటూ స్థానికులు నిలదీశారు. ఈ సమయంలో ఓ మహిళ ఆయన చొక్కా పట్టుకుని లాగుతూ దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగుతిన్నారు. అయితే ఇలా వరుసపెట్టి నేతలను నిలదీస్తుండడంతో ప్రజలలో తిరుగుబాటు మొదలైనట్టు కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే గ్రేటర్ ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడిగేందుకు కూడా నేతలు సాహసించరేమో అని అనిపిస్తుంది.