ఆమె తాగలేదు.. కానీ ఒంట్లో ఆల్కాహల్.. ఎలా..?

Friday, January 1st, 2016, 11:22:15 AM IST


అమెరికాలోని న్యూయార్క్ మహానగరం. ఫ్యాషన్ కు.. స్పీడ్ కు పెట్టింది పేరు. మద్యం సేవించే అలవాటు ఎక్కువగా ఉన్న వ్యక్తులు అక్కడ ఉంటారు. మద్యం సేవించి స్పీడ్ గా వాహనాలు డ్రైవింగ్ చేసే వ్యక్తులను పట్టుకొని వారికీ ఫైన్ వేసే పనిలో ఉన్నారు పోలీసులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే.. ఫైన్ తో పాటు శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. ఇంతలో ఓ పోలీసు కారును ఆపాడు. అందులో ఉన్న మహిళకు బ్రీతింగ్ టెస్ట్ చేశారు. మిషన్ రీడింగ్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మాములుగా న్యూయార్క్ చట్టాల ప్రకారం రక్తంలో ఆల్కాహాల్ 0.8 మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటె ఫైన్ వేస్తారు. కాని, ఈ మహిళకు మాత్రం బ్లడ్ లో 0.32 ఉన్నది. అంటే.. ఉండాల్సిన దానికంటే నాలుగు రెట్లు అదికంగా ఉన్నది.

వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే, ఆమె చెప్పిన విషయం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను మద్యం తాగనని, తనకు ఆటో బ్రేవరి సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నదని ఈ వ్యాధి కారణంగా అధికంగా కార్బోహైడ్రేడ్ ఫుడ్స్ తీసుకుంటే.. అది జీర్ణవ్యవస్థకు చేరగానే కార్బోహైడ్ కాస్త ఆల్కహాల్ గా మారుతున్నదని ఆమె చెప్పింది. ఇటువంటి వ్యాధి చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పారు. ఇక, పోలీసుల విచారణలో కూడా అదే నిజమని తేలడంతో.. ఆమెను వదిలేశారు.