వైసీపీ ఎమ్మెల్యే రోజా కి దిమ్మ తిరిగే షాకిచ్చిన అమరావతి బామ్మ!

Wednesday, January 15th, 2020, 09:30:45 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అంశం ఫై గత కొద్దిరోజులుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే రాజధాని అంశం ఫై, రైతుల ఫై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే వున్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు అమరావతి ఉద్యమం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. మగాళ్లకు దమ్ములేక ఆడవాళ్ళని రోడ్ల పైకి పంపి పోలీసులు కొట్టారంటూ ఆడంగి ఏడుపులు ఏడుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా ఫై అమరావతి మహిళలు స్పందించారు.

రోజా చేసిన వ్యాఖ్యలకు గాను అమరావతి ప్రాంతంలోని పలువురు రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి మహిళలు రాజాని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. మీ ఇంట్లో మీ ఆయనకి దమ్ములేక నువ్వు రాజకీయాల్లోకి వచ్చావా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు గాను నెటిజెన్లు బామ్మ తీరు ఫై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజాకి బాగా గడ్డి పెట్టారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.