టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. వేధిస్తున్నాడని హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు..!

Friday, September 25th, 2020, 07:17:26 AM IST

మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు షాక్ తగిలింది. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే భాస్కర్‌రావు వేదిస్తున్నాడని మణెమ్మ అనే మహిళ హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని వారికి ఎమ్మెల్యే అండగా ఉన్నారని అన్నారు. తన భర్త లాయర్ అని, ఎమ్మెల్యే బాధితుల తరపున వాధిస్తున్నాడని తెలిపారు.

అయితే బాధితులకు అండగా ఉండి కేసులు వాదిస్తున్నందుకు తన భర్తపై కక్ష్యతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించినందుకు తన భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు.