తెలంగాణ లో థియేటర్లు మళ్ళీ బంద్ చేసే అవకాశం?

Wednesday, March 24th, 2021, 11:40:32 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యా సంస్థలను తాత్కాలికం గా మూసి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ ను అరికట్టడానికి నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ధియేటర్లు మళ్ళీ బంద్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు ఖాయం అంటూ వివరించినట్లు తెలుస్తోంది.

అయితే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకి గురి చేస్తోంది. ఒక పక్క రెండవ దశ వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా నడుస్తున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం పట్ల కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ పంపినటువంటి ప్రతిపాదనల పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.