ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న సినిమాలో హీరోయిన్ తనేనా?

Monday, March 22nd, 2021, 10:48:58 AM IST

జూనియర్ ఎన్టీఆర్ రౌద్రం రణం రుధిరం చిత్రం తరువాత మరొక సినిమా లో నటించేందుకు సన్నహలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు పూర్తి కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమా లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరూ అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న చిత్రం కావడం తో దీని పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హీరోయిన్ గా మొదట పూజ హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ అనుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ సరసన నటించేది ఈమె అంటూ ఫిలిం నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఛలో చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక, a తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ సరసన సైతం నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే అల్లు అర్జున్ పుష్ప లో సైతం రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా రష్మీక దర్శకుడు త్రివిక్రమ్ కి మధ్య స్టోరీ డిస్కషన్ జరిగినట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కావడం, కథ కూడా ఆసక్తి గా ఉండటం తో ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అయినను పొయి రావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.