నాగార్జున తో పూరి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… వర్కౌట్ అయ్యేనా?

Sunday, January 17th, 2021, 11:00:38 PM IST

మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు సరికొత్త కథ తో అక్కినేని నాగార్జున తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కారణం గా సినిమా ల చిత్రీకరణలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నారు అని తెలుస్తోంది. నాగార్జున కోసం ఒక ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో రాసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే నాగార్జున తో సూపర్ మరియు శివమణి చిత్రాలు తీసి ఫ్యాన్స్ కి పునకాలు తెప్పించాడు పూరి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ షేక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పూరి జగన్నాథ్ వరుస చిత్రాల పై ఆసక్తి నెలకొంది. అటు నాగార్జున సైతం డిఫరెంట్ జోనర్ లో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.