అమ్మ జైల్లోనే క్యాంటిన్ పెడితే..

Tuesday, October 7th, 2014, 09:00:21 PM IST


ఇకపై అమ్మ జైల్లోనే ఉండబోతున్నది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజలకోసమే ఆలోచించేది. ప్రజల మంచికోసం అనేక పధకాలు ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా అమ్మ పేరుతొ ఆమె ప్రారంభించిన క్యాంటిన్లు, అమ్మ మెడిసిన్, అమ్మ ఉప్పు, అమ్మ థియేటర్స్, అమ్మ సిమెంట్ పేరుతో అనేక పధకాలు ప్రారంభించి అచిరకాలంలో ప్రజల మన్ననలను పొందింది. ఇక అమ్మకు తిరుగులేదు అనుకున్న సమయంలో..అక్రమాస్తుల కేసులో అమ్మ జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది.
అమ్మ జైలుకు వెళ్ళాక, తన పదవిని తన అనుంగ భక్తుడు పన్నీర్ సెల్వన్ కు అప్పగించింది.

అయితే, అమ్మ జైలులో ఉండటం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. అమ్మ ప్రజలమధ్య ఉంటే.. రాష్ట్రం ప్రగతిగురించి నిత్యం ఆలోచిస్తారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేందుకు అమ్మ నిరంతరం పాటుపడతారు. అందుకే.. ప్రజలు అమ్మకు జైలు నుంచి విముక్తి కావాలని, బెయిల్ రావాలని పూజలు చేశారు.. పార్టీ ఎంపీలు పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహించారు. అమ్మ అభిమానులు, అన్నాడీఎంకె కార్యకర్తలు… ఇటు జైలు వద్ద.. అటు కర్ణాటక హైకోర్ట్ వద్ద పడికాపులు కాశారు.. బెయిల్ వస్తుంది.. వస్తుంది..అని ఊరించి.. చివరకు అమ్మ జైలుకే పరిమితం కావాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది.

ఇక అమ్మ జైలులో ఉండి ఏమి చేయాలి. నిత్యం ప్రజలమధ్య ఉన్న జయలలిత జైలులో ఒంటరిగా ఉంటె ఆమెకు ఏమి తోచుబడిఅవుతుంది. జైలులో ఎన్నో సమస్యలు ఉన్నాయి..అక్కడా ప్రజలు ఉన్నారు.. కాకపొతే.. ఖైదీలుగా.. ఇక అమ్మ వారిగురించి ఆలోచించాలి.. వారికోసం పధకాలు రూపొందించాలి. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ ఎంత ఫేమస్ అయిందో.. జైలులో కూడా అమ్మ అటువంటి క్యాంటిన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడు జైలులో కూడా జయలలిత అమ్మగా పేరుప్రఖ్యాతలు సాధిస్తారు.