బీజేపి ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ..?

Sunday, November 30th, 2014, 04:24:26 PM IST


దేశవ్యాప్తంగా బీజేపి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఉత్తరాదిన తన ముద్రను వేసుకున్న బీజేపి ఇక దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు సిద్దమయింది. 2019లో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ఆ పార్టీ కసరత్తు చేస్తున్నది. 2019 నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నాలుగు నెలలకు ఓసారి తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో వస్తారని తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. కిషన్ రెడ్డి ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడుతున్నారన్నారు. 2019 నాటికి బీజేపీని బలమైన శక్తిగా మారుస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పదికోట్ల మందికి సభ్యత్వాన్ని అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టిగా బీజేపి అవతరించే విధంగా కృషి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.