హాట్ టాపిక్: నెగటివ్ రోల్ లో సిద్ధార్ద్ మెప్పించేనా!?

Monday, November 2nd, 2020, 04:14:08 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. అందులో ఓకే ఒక్క చిత్రం RX 100 తో అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఒక యువకుడ్ని అమ్మాయి ఎలా మోసం చేసింది అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అతని దర్శకత్వం లో రాబోతున్న మరొక సినిమా మహ సముద్రం. ఈ చిత్రం లో శర్వానంద్ హీరో గా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మరొక కీలక పాత్ర లో సిద్ధార్ద్ నటిస్తున్నారు.

అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత సిద్ధార్ద్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే లవర్ బాయ్ గా తన యాక్టింగ్ తో ఆకట్టుకొనే సిద్ధార్ద్ ఇప్పుడు విలనిజం చూపించేందుకు సిద్దం అయ్యారు. మహా సముద్రం చిత్రం లో నెగటివ్ రోలో లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టాలీవుడ్ లో సైతం పలు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది కానీ జరిగితే సిద్ధార్ద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది. అయితే సిద్ధార్ద్ నెగటివ్ రోల్ లో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అని తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.