వరల్డ్ కప్ విజేత ఎవరో..!

Monday, January 12th, 2015, 11:25:44 PM IST


ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అన్ని దేశాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు వరల్డ్ కప్ లో పాల్గొనే క్రీడాకారులను ప్రకటించింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలలో బౌన్సింగ్ పిచ్ లపై ఆడటం అంటే… బ్యాట్స్ మెన్లకు సవాలే. మరి బౌన్సింగ్ పిచ్ లపై సమర్ధవంతంగా ఆడగలిగే వారికే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక భారత్ విషయానికి వస్తే, ఇండియా జట్టు వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ లను ఆడిన విషయం తెలిసిందే. మరో విశేషం ఏమిటంటే, టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లి సూపర్ ఫాం లో ఉన్నాడు. అది అటుంచితే, అజిరింకా రహానే పరవాలేదని అనిపిస్తున్నా, శిఖర్ ధావన్ వరుసగా విఫలం అవుతున్నాడు. ఇక వన్డే కెప్టెన్ ధోని వరల్డ్ కప్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. 2011లో ఇండియాకు వరల్డ్ కప్ ను అందించిన ధోని, ఇప్పుడు అదే మాయ చేసి, మరలా వరల్డ్ కప్ ను అందిస్తాడో లేదో చూడాలి మరి.

వెస్ట్ ఇండీస్ సూపర్ ఫాం లో ఉన్నది. ఆ జట్టు సౌత్ ఆఫ్రికాను భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు సైతం మంచి ఫాం లో ఉన్నది. న్యూజిల్యాండ్ కూడా మంచి ఫాం ను కొనసాగిస్తున్నది. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో… ఏ జట్టు కప్ ను గెలుస్తుందో చూడాలి మరి.