ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి కొన్ని కీలక విషయాలు వెలువడ్డాయి. అయితే కరోనా వైరస్ తొలి కేసు తొలుత చైనా దేశంలోని వుహాన్ ప్రాంతంలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని, వైరస్ను చైనా దేశం కావాలనే బయటకు వదిలిందని చాలా దేశాలు చైనాపై ఆరోపణలు చేశాయి. కరోనా వైరస్ పుట్టుక, వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా సంయుక్త నివేదిక అందించాయి.
అయితే అందరూ ఆరోపిస్తున్నట్టుగా వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చే ఛాన్స్ లేదని WHO చెబుతుంది. అయితే గబ్బిలాల నుంచే కరోనా వచ్చిందని గబ్బిలాల ద్వారా జంతువులకు వాటి ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని నివేదిక తెలిపింది. ల్యాబ్ నుంచి వచ్చే అవకాశం లేదని ఇకపై ఆ ఆరోపణలు చేయడం సరికాదని తెలిపింది. WHO, చైనా ఇచ్చిన ఈ సంయుక్త నివేదికపై మరోసారి ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి.