ఇద్దరు ఓకే.. ఆ మూడోది ఎవరో..?

Tuesday, November 17th, 2015, 01:04:54 PM IST

nithya-rakul
చైతన్య.. ఏం మాయచేశావే తో తెలుగు ప్రేక్షకులను మాయచేశాడు. ఆ తరువాత ఒకటి రెండు మినహా చైతుకు మంచి హిట్స్ లేవు. అయితే, ఇప్పుడు చైతు ఏం మాయచేశావే దర్శకుడు గౌతమ్ మీనన్ తో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నారు. గౌతం మీనన్ సినిమా కాబట్టి మినిమమ్ గ్యారెంటి ఉంటుంది.

ఇక, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే విడుదల కాబోతున్నది. ఇక ఇదిలా ఉంటే, చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ మజ్ను కూడా రెడీ అవుతున్నది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రెమమ్ సినిమా కు ఇది రీమేక్. కార్తికేయ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందూ ఈ సినిమాకు దర్శకుడు. ఇక, ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. ఇప్పటికే ఇద్దరినీ ఎంపిక చేశారు. ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగ, మరొకరు శృతి హాసన్. అయితే, ఈ లవ్ స్టొరీలో మూడో హీరోయిన్ కూడా చాన్స్ ఉన్నదట. ప్రస్తుతం మూడో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. మూడో హీరోయిన్ గా నిత్యా మీనన్ లేదంటే రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అనుపమ స్కూల్ గర్ల్ గా చేస్తుంటే.. శృతి హాసన్ లెక్చరర్ గా కనిపించబోతున్నదట. మరి మూడో హీరోయిన్ ఎలా కనిపించబోతుందో.