పోల్ : ఈ ఇద్దరి మెగా హీరోల్లో ఎవరి డ్రెసింగ్ బెస్ట్ అనిపించేలా ఉంది..?

Wednesday, January 27th, 2016, 06:59:07 PM IST

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా మన స్టార్ హీరోలు మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, అఖిల్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు తమ డ్రెస్సింగ్ స్టైల్, లుక్ తో వేడుకలో హల్ చల్ చేశారు. అక్కడున్న వారినే కాకుండా, అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. ఆ సమయంలో క్లిక్ మనిపించిందే ఈ ఫోటో. మరి ఈ ఫోటో చూస్తుంటే.. ఇద్దరి మెగా హీరోల్లో ఎవరి డ్రెస్సింగ్ బెస్ట్ అనిపించేలా ఉందో చెప్పడం కొంచెం కష్టమే. అందుకే నెటిజన్ల అభిప్రాయాన్ని తెలుసుకుందాం..