కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు లేవు – డబ్ల్యూహెచ్ఓ

Tuesday, March 2nd, 2021, 02:33:11 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా ఈ మహమ్మారి తీవ్రత గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు లేవు అని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది చివరి కల్లా కరోనా విస్తృతి ఆగిపోతుంది అని అనుకోవడం అత్యాశే అని తేల్చి చెప్పింది.కరోనా విస్తృతి ఆగిపోతుంది అనే ప్రచారాలు అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. అయితే సమర్థవంతమైన కరోనా వైరస్ టీకాల వలన మరణాలు మరియు, ఆసుపత్రుల పాలయ్యే వారే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు.

అయితే ఈ మహమ్మారి కట్టడికి కరోనా వైరస్ టీకాలు తోడ్పడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఆలస్యం గా అయిన ఈ మహమ్మారి వ్యాప్తి ను పూర్తి స్థాయిలో నియంత్రిస్తామన్న విశ్వాసం ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ లోనే ఉందని,కానీ రూపాంతరం చెందుతున్న వైరస్ లు ప్రమాదకరం గా మారే అవకాశం ఉందని తెలిపారు.అయితే ఈ మహమ్మారి కట్టడికి అన్ని దేశాలు కలిసి పని చేయాలనీ తెలిపారు.