ఇప్పటి వరకు ఆ వైరస్ రకాలు వెలుగు చూడలేదు – డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్

Tuesday, May 25th, 2021, 01:45:44 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు మరియు మరణాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల కొత్త రకం వైరస్ లు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ లు రూపాంతరం చెందుతున్న కొద్ది టీకా లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటాయి అంటూ పలు చోట్ల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ టీకా సామర్థ్యాన్ని తట్టుకో గలిగే వైరస్ రకాలు వెలుగు చూడలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం అన్నారు.

అయితే భవిష్యత్ లో మాత్రం అలాంటి వైరస్ రకాలు రావు అని మాత్రం కచ్చితంగా చెప్పలేం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ భయాలతో వాక్సినేషన్ ప్రక్రియ ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సెప్టెంబర్ నాటికి ప్రతి దేశంలో కనీసం 10 శాతం మందికి, ఏడాది చివరకు 30 శాతం మందికి టీకాలు అందజేయడమే లక్ష్యం గా ముందుకు సాగాలి అంటూ సభ్య దేశాలకు పిలుపు ఇచ్చారు. అయితే వాక్సిన్ పంపిణీ లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి అని వ్యాఖ్యానించారు.