కరోనా వైరస్‌కు కొత్త పేరు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడి..!

Wednesday, February 12th, 2020, 12:03:06 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కి పేరు మారింది. చైనాలో వ్యూహాన్ నగరంలో మొట్టమొదటిగా గుర్తించిన ఈ వైరస్ అంచెలంచెలుగా అన్ని దేశాలకు పాకుతూ వస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన వైరస్‌ని నివారించేందుకు అన్ని దేశాలు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 43 వేల మంది కరోనా బారిన పడగా, ఒక్క చైనాలోనే 42 వేల మంది బాధితులున్నారని గుర్తించారు.

అయితే ఈ కరోనా వైరస్‌కు అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పేరును పెట్టింది. కోవిడ్-2019 అని నిర్ణయిస్తూ వ్హో చీఫ్ టెడ్రస్ అదానోమ్ మీడియాతో తెలిపారు. అయితే కోవిడ్ పూర్తి పేరు CO-carona, vi-Virus, D-desease 2019 2019 అని, కరోనా అనే పేరు కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుందని అన్నారు.