భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువే – ప్రపంచ ఆరోగ్య సంస్థ

Tuesday, September 15th, 2020, 01:53:26 AM IST

india_corona
భారత్ లో భారీగా నమోదు అవుతున్న కేసుల రి ప్రజలు మరింతగా భయాందోళన చెందుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే గడిచిన 24 గంటల్లో 3,07,930 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. అయితే ఈ సంఖ్య కరోనా వైరస్ విజృంభణ కి నిదర్శనం అని తెలపాలి.

అయితే ఎక్కువగా భారత్, బ్రెజిల్, యూ ఎస్ లో కేసుల తీవ్రత అధికంగా ఉన్నట్లు వెబ్ సైట్ లో సైతం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే 5,537 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 9,17,417 మంది ప్రాణాలను కోల్పోయారు. భారత్ లో 90 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, యూఎస్, బ్రెజిల్ దేశాల్లో 40 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం కారణం గా ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.