వేర్ ఈస్ సండ్ర వీరయ్య?

Monday, June 22nd, 2015, 01:22:22 PM IST


ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆచూకీ ఇప్పుడు అనుమాస్పదంగా మారింది. కాగా అనారోగ్యంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం అక్కడ నుండి గాయబ్ అయిపోయారు. ఇక కేవలం పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లుగా ఏసీబీకి లేఖ రాసిన సండ్ర వీరయ్య చికిత్స కోసం రోజుకో నగరం తిరుగుతున్నారు. అలాగే ఆసుపత్రిలో విచారణకు సిద్ధమన్న సండ్ర అసలు తాను ఏ ఆసుపత్రిలో ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఏసీబీకి చెప్పడం లేదని సమాచారం. ఇక ఈ క్రమంలో రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సండ్ర వెంకట వీరయ్య శనివారం మధ్యాహ్నం 2గంటల తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.