ఆ సమయంలో ‘అమిగ్దాల’ పక్కకు తప్పుకుంటే..!

Saturday, January 9th, 2016, 03:42:17 PM IST

మనిషిలో కలిగే భావాలను కంట్రోల్ చేసే ఆర్గాన్ ఏదంటే.. అమిగ్దాల అని ఖచ్చితంగా చెప్తాం. మెదడులో ఉండే అమిగ్దాల మనిషిలో కలిగే భయం.. ఉత్కంట.. కోపం వంటి వాటిని అదుపుచేస్తుంది. అమిగ్దాలకు వచ్చే సంకేతాలను విశ్లేషించి.. దేనికి భయపడాలి.. దేనికి ఎంగ్జైటి అవ్వాలి.. ఇక దేనికి కోప్పడాలి అనేది తెలియజేస్తుంది. అమిగ్దాల ఇచ్చే సిగ్నల్స్ ను బట్టి మనిషి ప్రవర్తిస్తాడు. కాని, ఒక్కదాని విషయంలో మాత్రం అమిగ్దాల యొక్క సిగ్నల్ ఆగిపోతాయట. అలా అమిగ్దాల నుంచి వచ్చే సంకేతాలు ఆగిపోవడంతో.. మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో మర్చిపోతాడట. ఆ సమయంలో మృగంలా ప్రవర్తించినా ఆశ్చర్యపోనక్కరలేదని చెప్తున్నారు నెదర్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధనకులు.

ప్రకృతికి విరుద్దంగా మనిషి ఏ పనులు చేయలేడన్నది వాస్తవం. ప్రకృతికి లోపడే ఏ పనులైనా జరుగుతాయి. మనిషిలోకి కామవాంచ కోరికలు ప్రవేసించగానే.. మనిషి మెదడులోని అమిగ్దాల పనిచేయడం తాత్కాలికంగా ఆగిపోతుంది. అలా ఆగిపోయిన తరువాత మనిషి మృగంలా ప్రవర్తిస్తాడని తాజా పరిశోధనలో వెళ్ళడయింది.