వాట్సాఫ్‌లో సరికొత్త ఫీచర్.. అదేమిటంటే?

Wednesday, September 23rd, 2020, 12:11:44 AM IST


ప్రపంచంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాఫ్. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఈ యాప్ ఇప్పుడు మరో అప్డేట్ చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం నిర్ణీత సమయంలో మాత్రమే అవతలి వాళ్ల ఫోన్‌ నుంచి మెసేజ్ డిలీట్‌ చేసే సదుపాయం ఉండగా ఇకపై మనం అవతలి వారికి పోస్ట్ చేసిన చాట్ ఎప్పుడు డిలీట్ చేయాలనేది నిర్ణయించుకోవచ్చు.

అంతేకాదు చాట్ నుంచి బయటకు వస్తే మనం పంపిన సమాచారం అంతా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అయితే మనం ఎవరికైనా పంపిన డేటాను నిర్ణీత సమయంలో డిలీట్ చేయాలి అనుకుంటే సెండ్‌ బటన్‌ పక్కనున్న టైమర్‌లో ఆ సమయాన్ని సెలెక్ట్‌ చేసి పెట్టేసే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఆ సమయానికి అది డిలీట్ అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ను త్వరలో బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తర్వాత అందరికీ వర్తింపజేయనుంది.