మన హీరోలకేమైంది.. అఖిల్ ఆటో నడిపితే.. రానా మూటలు మోశాడు..!

Wednesday, February 10th, 2016, 02:52:37 PM IST


కొన్ని రోజులుగా మన టాలీవుడ్ తారాగణం విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఆటోలు తోలడం, మూటలు మోయడం వంటి పనులు చేస్తున్నారు. ఇంతకుముందు హీరో అక్కినేని అఖిల్ ఖమ్మంలో ఆటో నడిపితే .. తాజాగా నటుడు రానా రైతు బజారులో మూటలు మోశాడు. సడన్ గా వీరు రోడ్లపై ఆటోలు నడుపుతూ, మూటలు మోస్తూ ఉండటం చూసిన జనాలు ఏంటి వీళ్ళంతా ఈ పనులు చేస్తున్నారు. కొటీశ్వరులైన వీళ్ళకేం అవసరం అనుకున్నారు.

విషయంలోకెళితే మంచు లక్ష్మి నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థకు తమ వంతు సాయంగా మేము సైతం అంటూ వీరంతా ఇలా బయట పనులు చేసి వచ్చిన విరాళాలను పేదలకు, రోగులకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే హీరోయిన్ రకుల్ కూకట్ పల్లి కూరగాయల మార్కెట్ లో కూరగాయలమ్మితే, అఖిల్ ఆటో నడిపి, రానా మూటలు మోసి విరాళాలు సేకరించారు.