వాట్ బన్నీ .. ఇంకా క్లారిటీ రాలేదా ?

Tuesday, September 18th, 2018, 10:12:53 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య భారీ పరాజయం పాలవడంతో నెక్స్ట్ సినిమా విషయంలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపినా కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నాడట. నా పేరు సూర్య విడుదలై దాదాపు ఆరునెలలు గడుస్తున్నా కూడా పరిస్థితి మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే అయన ఫాన్స్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో సినిమాకు సిద్ధం అయ్యాడు కానీ స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదట. ఈ కథలో మాస్ కమర్షియల్ అంశాలు లేవట. అందుకే స్క్రిప్ట్ మార్చమని చెప్పాడట. ప్రస్తుతం విక్రమ్ కుమార్ అదే పనిలో ఉన్నాడు. అలాగే తమిళ దర్శకుడు కూడా బన్నీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట బన్నీ. అలాగే యంగ్ దర్శకుల కథలను కూడా వింటున్నాడట. మొత్తానికి తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా అల్లు అర్జున్ క్లారిటీ గా లేడని తెలుస్తోంది. నిజానికి బన్నీ నెక్స్ట్ సినిమా విషయంలో ఇంత గ్యాప్ తీసుకోకూడదని అంటున్నారు సినీ జనాలు.