పవన్ మద్దతుతో వరంగల్ లో గెలుస్తుందట..!

Friday, November 13th, 2015, 12:31:17 PM IST


వరంగల్ ఎంపి ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో ప్రచారం వేడి మొదలైంది. అన్ని పార్టీలు తమ బలానికి తగిన విధంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీని డీ కొట్టేందుకు తెలుగుదేశం – బిజేపిలు అమ్ముల పోదిలోని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.

ఇక, ఇదిలా ఉంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్.. చంద్రబాబుల మధ్య ఆసక్తి కరమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి.
ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవలను తాము తప్పకుండా వినియోగించుకుంటామని, పవన్ వరంగల్ లో ప్రచారం చేస్తారాని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ చెప్తున్నారు. జనసేన సేవలను వినియోగించుకొని వరంగల్ లో విజయం సాధిస్తామని రమణ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ – బిజేపి లు ఉమ్మడిగా అక్కడ పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్ధిగా దేవయ్యను నిలబెట్టిన సంగతి విదితమే. పవన్ వరంగల్ లో ప్రచారం చేసే అంశాన్ని జనసేన పార్టీ నేతలతో చర్చించి చెప్తానని చెప్పారు. మరి పవన్ ప్రచారానికి వస్తారా రారా అన్నది తేలాలి.