భారత్ పై వ్యాఖ్యలు తమవి కాదంటున్నపీపీపీ

Friday, October 10th, 2014, 11:50:48 AM IST

ppp
పాకిస్థాన్ మాజీ దేశాధ్యక్షుడు తనయుడు బిలావల్ భుట్టో. తల్లి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, తండ్రి మాజీ దేశాధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ. వారి నుంచి రాజకీయాన్ని ఒంటబట్టించుకున్నాడు బిలావల్ భుట్టో. ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎలాగైనా రాజకీయాల్లో చెక్ చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాడు బిలావల్. పాకిస్థాన్ రాజకీయాల్లో పిల్ల కాకిగా పేర్కొనే బిలావల్ ఇటీవల కాలంలో ప్రజల అభిమానం చూరగొనేందుకు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. భారత్ అంటే ఊగిపోయే పాకిస్థాన్ ప్రజలకు బిలావల్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

గతంలో కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు బిలావల్ భుట్టో జర్దారీ. ‘‘పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని అనుకుంటున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి’’ అని బిలావల్ భుట్టో తన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికారిక వెబ్ సైట్‌లో రాశాడు. అయితే ఇవి బిలావల్ భుట్టో చేసిన కామెంట్స్ కాదని పీపీపీ నేతలు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు బిలావల్ చేసినవి కావని పార్టీ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ తరహా పోస్టింగ్లు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ కామెంట్స్‌పై మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.