సమ్మె ఆపేది లేదు

Sunday, November 2nd, 2014, 03:43:36 PM IST

doctors
తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని.. ఎలాంటి పరిస్థితులలో కూడా సమ్మెను విరమించబోమని జూడాలు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అనంతరం న్యాయసలహా తీసుకొని ముందుకు వెళ్తామని జూడాలు తెలియజేశారు. తాము గ్రామీణ ప్రాంతాలలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని తాము కోరుకుంటున్నామని..జూడాలు స్పష్టం చేశారు. తమను గ్రామీణ ప్రాంతాలకు పంపించే తీరే బాగాలేదని.. దీనిపైనే తాము పోరాటం చేస్తున్నామని జూడాలు ఈ రోజు తెలిపారు.

తెలంగాణ ఏర్పడక ముందు తమకు సపోర్ట్ చేసిన తెరాస పార్టీ.. తెలంగాణ ఏర్పడి.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తమ డిమాండ్లను నెరవేర్చకపోగ… తమపై ఎస్మా ప్రయోగించి ఆరు నెలలపాటు డీబార్ చేస్తామనడం తొందరపాటు చర్య అవుతుందని.. జూడాలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సమ్మెను మాత్రం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.