వీరప్పన్ భార్యకు ‘వర్మ’ సవాల్

Tuesday, December 1st, 2015, 11:35:27 AM IST


సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’ ఈ నెల 4న విడుదల కావాల్సి ఉంది. కానీ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి మాత్రం సినిమాలో తన భర్తను చూపించిన విధానం చాలా దారుణంగా ఉందని దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని అన్నారు. అవినీతిపరులైన కొందరు అధికారుల బారి నుండి అడవిని కాపాడటానికి తన భర్త అహర్నిశలూ పాటు పడ్డాడని, ఆయన్ను తమిళ ప్రజలు దేవుడిగా భావిస్తారని, ఈ సినిమా వల్ల కర్నాటక, తమిళ రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు తలెత్తుతాయని అన్నారు.

అంతేకాకుండా తన అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయకూడదంటూ ఆమె బెంగుళూరు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన వర్మ ‘ ప్రతి తల్లికి తన బిడ్డలు మంచివాళ్ళలానే కనబడతారు. అలాగే భార్యకు భర్త కూడా. ఒసామా బిన్ లాడెన్ భార్యకు అతనే అందరికంటే మంచివాడిగా కనపడతాడు. అలాగని వాళ్ళందరినీ మంచివాళ్ళంటే మరి గాంధీగారి సంగతేంటి..?’ అంటూ ఆమెకు ఎదురు సవాల్ విసిరారు. ఈ వివాదంతో ప్రస్తుతం కిల్లింగ్ వీరప్పన్ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.