సంచలనంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్..!

Saturday, March 20th, 2021, 02:37:32 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అయితే ఈ రోజు సాయత్రం ఉక్కు కార్మిక గర్జన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తుంది. సాయంత్రం 5:49 గంటలకు అగ్నికి ఆహుతి అవుతున్నానంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో ప్రస్తుతం అతడి కోసం పోలీసులతో పాటు కుటుబ సభ్యులు, కార్మికులు గాలిస్తున్నారు.

అయితే అసలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే ప్రియమైన కార్మిక సోదరులారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలమని, ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలని, 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దని, నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నానని, ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమిషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటానికి ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలని రాశారు.