అమెరికా అత్యున్నత వైద్యుడిగా వివేక్ మూర్తి!

Tuesday, December 16th, 2014, 06:37:08 PM IST

vivek-murti
అమెరికా అత్యున్నత వైద్యుడిగా(యూఎస్ సర్జన్ జనరల్ )గా భారత సంతతికి చెందిన వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. కాగా 37ఏళ్ళ అతిపిన్న వయసులోనే వివేక్ మూర్తి ఈ పదవిని అలంకరించబోతున్నారు. ఇక వివేక్ మూర్తి ఎంపికపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మాట్లాడుతూ ‘వివేక్ ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ వ్యక్తి. ఎబోలాపై పోరాటానికి, అమెరికా ప్రజల ఆరోగ్య భద్రతపై వివేక్ నేతృత్వంలో మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నా’నని హర్షం వ్యక్తం చేశారు.