రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కి ఇటీవలే చెప్పాను – విశ్వేశ్వర్రెడ్డి

Wednesday, March 17th, 2021, 02:00:05 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీ శ్రేణులకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఇటీవలే చెప్పాను అని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ కి నష్టం జరుగుతుంది అని ఎవరికి చెప్పొద్దు అని కోరడం తో ఆయన మాటను గౌరవించి చెప్పలేదు అని అన్నారు. అయితే మీడియా ద్వారా అందరికీ తెలిసింది అని చెప్పుకొచ్చారు. రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తాను అని వ్యాఖ్యానించారు.

అయితే మన ప్రాంత, రాష్ట్ర, దేశ అబివృద్ధి కి ప్రజల మంచి కోసం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. కొత్త పార్టీ పెట్టాలా? ఇండిపెండెంట్ గా ఉండాలా? మరో పార్టీ లో చేరాలా అనే విషయం అందరితో కలిసి చర్చిస్తా అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ఎవరి పై కూడా ఒత్తిడి చేయను అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ లో చేరినప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా తనకు మద్దతు తెలిపిన వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.