గ్లెన్ మ్యాక్స్ వెల్ పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Thursday, December 10th, 2020, 12:50:09 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 10 కోట్ల రూపాయల తో గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఐపియల్ లో దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే చివరి ఐపియల్ సీజన్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ అన్ని మ్యాచుల్లో కలిపి 105 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అయితే తాజాగా ఆసీస్ భారత్ సీరీస్ లలో మ్యాక్స్ వెల్ ఆటతీరు మరో విధంగా ఉంది. వన్డే సీరీస్ లో 167 పరుగులు చేయగా, టీ 20 సీరీస్ లో 78 పరుగులు చేశాడు. అయితే ఇతని ఆటతీరు పై మన భారతీయులు పలు విమర్శలు చేశారు.

తాజాగా భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపియల్ లో ఆడేటప్పుడు, ఆసీస్ కి ఆడేటప్పుడు మనం రెండు రకాల మ్యాక్స్ వెల్ ను చూస్తామని పేర్కొన్నారు. అయితే ఆసీస్ కి ఆడేటప్పుడు వరుసగా రెండు మ్యాచ్ లు విఫలం అయితే తీసేస్తారు అనే భయం ఉంటుంది అని, అందుకే అతని ఆట తీరు మారింది అని, ఐపియల్ లో అలాంటి ఒత్తిడి ఉండదు అని, మ్యాచ్ లు ఆడినా, ఆడకపోయినా యాజమాన్యం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. ఐపియల్ లో మ్యాక్స్ వెల్ ఎంజాయ్ మూమెంట్ లో కనిపిస్తాడు అని, ఇతర ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం, తోటి క్రికెటర్ల తో విహార యాత్రలు చేయడం, ఆట ముగిసిన తర్వాత ఫ్రీ గా అందించే డ్రింక్స్ ను హోటల్ కి తీసుకెళ్ళి తాగుతూ ఎంజాయ్ చేస్తాడు అని అన్నారు. అందుకే ఐపియల్ లో సీరియస్ ఆట లేదు అని, క్రికెట్ ఆడటం కన్నా వచ్చిన పని పై దృష్టి పెట్టేవాడు అను సంచలన వ్యాఖ్యలు చేశారు.