ఐపీఎల్: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. కారణం అదే?

Friday, September 25th, 2020, 04:19:18 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కప్ నందే అని బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సన్‌రైజర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బోణీ కొట్టినా, నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అబిమానులు కాస్త నిరాశ చెందారు. ఈ త‌రుణంలో బెంగుళూర్ అభిమానులకు మ‌రో షాకింగ్ విష‌యం తెలిసింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగ‌ళూర్ కెప్టెన్‌కు 12 లక్షల భారీ జ‌రిమాన విధించారు.

అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ యొక్క రెండు క్యాచులను వదిలేయడంతో ఆ జట్టు భారీ స్కోరును నమోదు చేయగలిగింది. అనంతరం లక్ష్య చేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముందు నుంచే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వల్ఫ స్కోరుకే కుప్పకూలిపోయింది.