గుడ్‌న్యూస్: తండ్రయిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..!

Monday, January 11th, 2021, 05:42:09 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ తండ్రయ్యాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను విరాట్ కోహ్లీ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపాడు. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలకు కృతజ్ఞతలు అంటూ ఈ సమయంలో దయ చేసి మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు.

ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మాత్రమే ఆడిన కోహ్లీ పితృత్వ సెలవులపై భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే కొద్ది సేపటి క్రితమే పాప జన్మించడంతో ఆ సంతోషాన్ని అభిమానులకు తెలియచేశాడు.