ఆ ఉప ఎన్నిక బరిలో రాములమ్మ.. పోరు రసవత్తరమే..!

Thursday, September 3rd, 2020, 07:29:15 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు పోటీ చేసే అవకాశం ఉండగా, బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిపితే పోరు రసవత్తరంగా ఉంటుందన్న ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా సవాల్‌గానే తీసుకుంటుంది. తమ స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని భావిస్తుంది. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది.