“సర్జికల్ స్ట్రైక్” అనగానే తెరాస, ఎంఐఎం లు ఎందుకు ఇంత ఆగమాగం అవుతున్నాయి

Wednesday, November 25th, 2020, 01:52:52 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార నేపద్యం లో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తెరాస, ఎం ఐ ఎం ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గెలిస్తే పాతబస్తీ లోని పాకిస్తానీ లు, బంగ్లా దేశీయులు, రోహింగ్యల పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు తెరాస, ఎం ఐ ఎం పార్టీ లు ఘాటు గానే స్పందించాయి. అయితే ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీ లో రోహింగ్యాలు, పాకిస్తానీ ల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి అంటూ సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండం గా ఇంటింటి సర్వే చేసిందని, పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి అధికార పూర్వక నివేదిక ఇవ్వొచ్చు గా అంటూ సూటిగా ప్రశ్నించారు. లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళన లకి టీఆర్ఎస్ గురి అవుతుంది అని ప్రజలు అభిప్రాయ పడే అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తారో చూడాలి.