తుగ్లక్ పాలన లో ఇది మరో ప్రహసనం – విజయశాంతి

Monday, December 28th, 2020, 09:19:35 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యం గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరసనలో పాల్గొని భారత్ బంద్ లో సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఎండగడుతూ మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నియంత్రిత సాగు నిర్ణయం తో నష్టపోయిన రైతులకు బాధ్యులు ఎవరూ అంటూ సూటిగా ప్రశ్నించారు.తల తిక్క ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయం తో తీరని నష్టం జరిగింది అని, ఎన్నో వైఫల్యాల తుగ్లక్ పాలన లో ఇది మరో ప్రహసనం అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నప్పుడు రైతు బంద్ పెట్టీ ఎందుకు సతాయించావు అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తో పలువురు నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.