కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలి

Monday, January 11th, 2021, 08:31:47 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం పట్ల ప్రముఖ నటి, బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్న వార్త సంతోషాన్ని ఇచ్చింది అని విజయశాంతి అన్నారు. ఆయన నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. కానీ తమ ఆరోగ్యం బ్రహ్మాండం గా ఉందన్న ప్రకటన ఇచ్చిన భరోసా తో కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో మాయమై మళ్లీ ఫాం హౌజ్ కే పరిమితం అవుతారేమో అని ఆందోళన కలుగుతుంది అని వ్యాఖ్యానించారు.

అయితే ఆయన తన తీరు మార్చుకొని హైదరాబాద్ లో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యే లు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకి దయ కలిగితే కొంత సమయం ప్రజలకు, ప్రజా సమస్యలకు కేటాయించే కార్యక్రమం చేపడతారని తెలంగాణ సమాజం మరియు అధికార పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే అవినీతి కేసులు తేలితే ఏదో ఒక రోజు చెయ్యి జారిపోయే పరిస్థితులు ఉన్న ఆ ముఖ్యమంత్రి పదవి లో ఆ మిగిలిన కాలమైనా పని చేస్తే మంచిది అంటూ వ్యాఖ్యానించారు.