కేసీఆర్ చేస్తున్న ప్రకటనల వెనుక మర్మం ఎవరికీ తెలీదు అనుకుంటే పొరపాటే

Thursday, December 31st, 2020, 10:51:47 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పై మరొకసారి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది అని విజయశాంతి తెలిపారు. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరి లో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ ఆర్ ఎస్ పై వెనక్కి తగ్గడం, ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మం ఏంటో ఎవరికీ తెలియదు అనుకుంటే పొరపాటే అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

అయితే గడిచిన తెరాస ఆరేళ్ల పాలన కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యల పై ఇప్పుడు ఒక్కొక్కటి గా దృష్టి సారించడం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే దుబ్బాక, గ్రేటర్ ఫలితాల్లో ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది అని అన్నారు. అయితే ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, రాబోయే ఉప ఎన్నికల్లోనూ వస్తే అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెరాస కి ప్రతి సందర్భం లో కూడా ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు.