తామే గెలుస్తామని పర్సెంటేజి లెక్కలతో చెప్పుకోవటం హాస్యాస్పదం – విజయశాంతి

Saturday, February 27th, 2021, 11:10:58 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే గెలుస్తామని సీఎం గారు పర్సెంటేజి లెక్కలతో చెప్పుకోవటం హాస్యాస్పదమని, అసలు టీఆర్ఎస్ నిలబెట్టే అభ్యర్థి కబ్జాకోరో.. దోపిడీదారో తెలిసినంక ప్రజలు ఏ స్థానం ఇయ్యాలో నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి గారి ఊహాగానాలు కూడా అని అన్నారు.

అయితే కేసీఆర్ గారివి అన్నీ అవకతవక పిచ్చి సర్వేలని నేను గతంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పానని, చెప్పినది కూడా అదే తీరున జరిగిందని అన్నారు. అయితే బండి సంజయ్ గారికి లోకసభ స్పీకర్ అనుమతి లభించినట్లయితే.ఈ అసత్యాల ముఖ్యమంత్రి గారి అనేక మోసాలలో మరొక్కటి బయటపడి ప్రజలకు మరింత స్పష్టత ఏర్పడుతుందని అన్నారు.