అరాచకం హద్దు మీరుతోంది.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Wednesday, January 13th, 2021, 02:35:45 AM IST


వరంగల్ జిల్లా జనగాంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. అయితే స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

అరాచకం హద్దు మీరుతోంది. పోరాటాల ఖిల్లా ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలలో ఈ దుర్మార్గాలకు జిల్లా ప్రజల ప్రతిఘటనలు కూడా అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తీరున వ్యవహరిస్తే మీ నాయకులు కూడా అక్కడ తిరగలేని పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఉద్యమాలకు ముందుండి పోరాడే నాలాంటి కార్యకర్తలం బీజేపీలో అసంఖ్యాకంగా ఉన్నామని గుర్తు పెట్టుకోండి అంటూ విజయశాంతి హెచ్చరించారు.