కేసీఆర్ దొరగారి వైఫల్యాలపై పెద్ద గ్రంథమే రాయొచ్చు – విజయశాంతి

Wednesday, August 19th, 2020, 10:00:44 AM IST

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మహిళా ఫైర్ బ్రాండ్ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనమని, చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైందని అన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చు అని ఇకనైనా మేలుకోండి అని పరిపాలనా వ్యవస్థను ఇకనైఅన చక్కదిద్దండని అన్నారు. మరో పక్క ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదని, మరో వైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి అని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యం అని అన్నారు.